ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అని మనందరం వింటూవుంటాం మరి నిజంగా శరీరం లోపల ఆరోగ్యానికి ఉల్లి ఉపయోగపడుతుందో లేదో గాని జుట్టుకు మాత్రం భలే ఉపయోగపడుతుంది. ఈ మధ్య అందరికీ జుట్టు ఊడిపోవడం ఎక్కువైంది జుట్టు పల్చబడటం జుట్టు విరిగిపోవటం జుట్టు కుదుళ్లు బలహీనంగా అయిపోవటం దువ్వుకుంటుంటేనే తలస్నానం చేస్తుంటేనే ఊడి వచ్చేస్తున్నాయి కుప్పలు కుప్పలు కుచ్చులు కుచ్చులుగా వచ్చేస్తున్నా జుట్టు మరి అది ఊడకుండా ఉండాలి బలంగా ఉండాలంటే జుట్టు హెల్దీగా ఉండాలంటే కొత్త జుట్టు తిరిగి రావాలంటే ఏంచేయాలి అందరి ఆలోచనా దీనిని వివరంగా వివరించుకుందాం.
ఉల్లి పై పరిశోధన
మరి మనం ఈరోజు ఉల్లిపాయకి జుట్టుకి ఉన్న సంబంధాన్ని సైంటిఫిక్ ప్రూఫ్ ఏమిటంటే ఉల్లి పై ఎవరు పరిశోధన చేశారంటే 2002 వ సంవత్సరంలో “యూనివర్సిటీ ఆఫ్ బాగ్దాద్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ఇరాక్” వారు ఈ ఉల్లిపాయ మీద జుట్టుకు ఎట్లా ఉపయోగపడుతున్నది అని పరిశోధన చేశారు ముఖ్యంగా మూడు నాలుగు విషయాలు అతి ముఖ్యమైనవి.
మొట్టమొదటి అసలు ఉల్లిపాయలో సల్ఫర్ అనేది బాగా ఎక్కువ ఉంటుందండి అమ్మోనియా ఇట్లాంటివి కూడా ఎక్కువ ఉంటాయి. అందుకనే మనకి కట్ చేసినప్పుడు కళ్ళమ్మట నీళ్లు కారటం ఈ సల్ఫర్ అనేది కటింగ్ అయిన తర్వాత అది గాలిలో మరి కంటికి తగిలేసరికి కంటిలోకి వెళ్లి రియాక్షన్ జరిగేసరికి సల్ఫ్యూరిక్ యాసిడ్ గా మారి కొంచెం మంటలు కలిగించడం ఇవన్నీ మనకు తెలుసు అందులో ఉండే సల్ఫర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయంట మామూలుగా ఇందులోనే ఇంత సల్ఫర్ ఎక్కువ ఉండదు కదా మరి ఉల్లిపాయలో ఉన్న సల్ఫర్ జుట్టు కుదుళ్లు దగ్గర ఎలాంటి లాభాన్ని కలిగిస్తుంది.
కెరాటిన్ అనే ప్రోటీన్ కు జుట్టు కు సంబంధం ఏమిటి?
మన వెంట్రుక అనేది కెరాటిన్ అనే ప్రోటీన్ అంటారు. ఈ కెరాటిన్ ఉత్పత్తి చేయాలంటే జుట్టు కుదుళ్ళలో కెరాటినోసైట్స్ ఉంటాయి. కెరాటిన్ ఉత్పత్తి చేసే కణజాలాలు ఈ సల్ఫర్ అనేది ప్రధానంగా జుట్టు కుదుళ్ళల్లో ఉండే కెరాటిన్ ఉత్పత్తిని బాగా పెంచటానికి భలే ఉపయోగపడుతుందంట అంటే జుట్టు గ్రోత్ కి ఈ సల్ఫర్ బాగా ఉపయోగపడుతున్నది ఆ కెరాటిన్ ఆ సెల్స్ నుంచి బాగా ప్రొడ్యూస్ అయింది అనుకోండి జుట్టు గ్రోత్ హెల్దీగా బాగా స్పీడ్ గా ఉండటానికి అవకాశం ఉందట ఇది సల్ఫర్ లో ఉండే మొట్టమొదటి లాభం అని వాళ్ళు నిరూపించడం జరిగింది.
జుట్టు ఊడకుండా మనకు సల్ఫర్ ఏ విధంగా సహాయపడుతుంది
రెండవది మనకి మాడు భాగం చర్మం ఉంది ఈ చర్మంలో ఎప్పుడైనా సరే ఈ చర్మం అయినా చర్మం కింద కాస్త ఒక మెష్ ఉంటుందండి దాన్నే కొలాజన్ మెష్ అంటారు. ఈ కొలాజన్ మెష్ అనేది తలలో ఉండే చర్మ భాగం కింద కూడా ఈ సల్ఫర్ అనే దాని వల్ల హెల్దీగా ఉంటుందట , హెల్దీగా చర్మం కింద ఉంటుంది గనుక మెష్ బాగుంది అనుకోవచ్చు కొలాజన్ మెష్ అప్పుడు ఏమవుతాయి జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటాయి. జుట్టు కుదుళ్ళు దెబ్బ తినకుండా జుట్టు కుదుళ్ళు కదలకుండా కూడా ఈ కొలాజన్ అనే మెష్ చక్కగా పట్టి ఉంచుతుంది. అందుకని జుట్టు ఎక్కువ ఓడిపోకుండా కూడా సల్ఫర్ ఆ రకంగా ఉపయోగపడుతున్నదని వాళ్ళు అందించడం జరిగింది.
మూడో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉల్లిపాయలో ప్రధానంగా రెండు ముఖ్యమైన కెమికల్స్ ఉన్నాయి. ఒకటి క్యాంఫిరాలు రెండోది క్వార్సెటిన్ ఇవి రెండూ ఉండటం వల్ల జుట్టు కుదుళ్ళకి రక్తనాళాలు ఏవైతే ఉంటాయో మరి రక్తనాళాల ద్వారా రక్తం రావటానికి రక్తం వస్తే కదా ప్రాణవాయువు మరి నీరు ఆహార పదార్థాలు విటమిన్స్ అన్ని జుట్టు కుదుళ్లకు వచ్చేది. మరి ఆ జుట్టు కుదుళ్లకు వచ్చే రక్త ప్రసరణ సంబంధమైన రక్తనాళాల వ్యవస్థని బాగా వ్యాకోచింప చేసి బాగా రక్త ప్రసరణ జుట్టు కుదుళ్లకు జరిగేటట్టు ఈ రెండు కెమికల్స్ ప్రధానంగా ఉపయోగపడుతున్నది అని నిరూపించడం జరిగింది. అంటే దాని అర్థం ఉల్లిపాయకి జుట్టుకి ఎంత మేలు చేస్తుంది.
నాలుగవది ఏమిటంటే ఈ ఉల్లిపాయలో సల్ఫర్ అమోనియా ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి. వీటి వల్ల మన తలలో మరి గాలిలో ఉండే బ్యాక్టీరియాలు గాలిలో ఉండే ఫంగస్ క్రిములు చెమటలో చేరి ఎక్కువగా పేరుకుంటాయి. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్లే తలలో దురదలు రావటాలు చుండ్రులు రావటాలు కాస్త ఎక్కువ జుట్టు కుదుళ్ళు ఆరోగ్యం దెబ్బ తినటానికి ఇన్ఫెక్షన్స్ కూడా ఒక కారణం ఈ ఇన్ఫెక్షన్స్ ని నిరోధించడానికి ఒకవేళ వస్తే కూడా కంప్లీట్ గా మానిపోవటానికి ఉల్లిపాయ ప్రధానంగా ఉపయోగపడుతుందట మరి ఇన్ని రకాలుగా సైంటిఫిక్ గా పరిశోధనలు చేసి శాస్త్రజ్ఞులు నిరూపించారు కాబట్టి ఉల్లిపాయ జుట్టు ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది మీరందరూ నమ్మొచ్చు 100% ఉపయోగించుకోవచ్చు.
జుట్టుకు ఉల్లిపాయను ఏ విధంగా ఉపయోగించాలి
అందుకని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ప్రతి కూరలోనూ వేస్తుంటాం అట్లాగే ప్రతిరోజు ఉల్లిపాయని కాస్త గ్రైండ్ చేసి పేస్ట్చేయండి. ఆ ఉల్లి పేస్ట్ ని మాడుకు బాగా పట్టించండి తలంతా కూడా నూనె ఎట్లా పట్టిస్తారో బాగా మర్దం చేసి ఆ ఉల్లి పేస్ట్ ని ఉల్లి రసాన్ని బాగా మాడుకు పట్టించి ఆరే వరకు 20 నిమిషాలు అరగంట అట్టు పెట్టుకోండి చక్కగా తలస్నానం చేయండి. జుట్టు కుదుళ్ళు హెల్దీగా అవ్వటానికి జుట్టు ఊడిన తిరిగి రావటానికి జుట్టు గ్రోత్ బాగుండటానికి జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ వ్యవస్థ బాగా పెరగటానికి ఇవన్నీ రకాలుగా ఉపయోగపడుతుంది. ఇన్నాళ్ళు జుట్టు కోసం పాపం రకరకాలుగా మీరు అనేక ప్రయత్నాలు చేశారు. అలాంటి ప్రయత్నాల్లో కూడా సైంటిఫిక్ గా చాలా ఉండవు ఏదేదో ఎవరో చెప్తారు మనం ఏదో చేస్తుంటాం. అందుకని మీరందరూ జుట్టు ఆరోగ్యానికి ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి సైంటిఫిక్ గా పురువైన వాస్తవాలు ఇవి.